Super El Nino: కరెంట్ కే షాకివ్వబోతున్న సూపర్ ఎల్ నినో- భారత్ పై తీవ్ర ప్రభావం..! 

మన దేశంలో విద్యుత్ రంగం ఈ ఏడాది సరికొత్త సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ పరిశోధనా సంస్థ 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' (CREA) తన తాజా నివేదికలో హెచ్చరించింది. రానున్న రోజుల్లో 'సూపర్ ఎల్ నినో' ప్రభావం గనుక బలపడితే, దేశంలో ఎండ తీవ్రత అసాధారణంగా పెరగనుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఊహించని విధంగా పెరగడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం (Power)

సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇళ్లలో, ఆఫీసులలో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఇదే సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు క్షీణించి, జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా గాలుల వేగం తగ్గి, పవన విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడవచ్చు. ఈ పరిణామాల వల్ల దేశంలో దాదాపు 1800 కోట్ల యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడవచ్చని, ఫలితంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అదనపు భారం పడుతుందని నివేదిక అంచనా వేసింది.

India Power Sector Faces Massive Shortage Risks Amid Heat And El Nino Impact Report 2026

మళ్ళీ బొగ్గు విద్యుత్ వైపే చూపు

గడచిన ఆరేళ్లలో భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగం గణనీయంగా పుంజుకున్నప్పటికీ, నేటికీ దేశీయ అవసరాలకు బొగ్గు ఆధారిత విద్యుత్ పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థిక సంవత్సరం 2021లో 69 శాతంగా ఉన్న బొగ్గు విద్యుత్ వాటా, 2024లో 73 శాతానికి చేరి, ఆ తర్వాత 2026 నాటికి 67 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, పర్యావరణ అనుకూల ఇంధన లభ్యత తగ్గితే గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటానికి బొగ్గు ఇంధనమే గతి అవుతోంది. ప్రస్తుతం సౌర విద్యుత్ వాటా 9 శాతానికి చేరగా, పవన విద్యుత్ 6 శాతంగా, జల విద్యుత్ 10 నుండి 11 శాతంగా కొనసాగుతోంది.

India Power Sector Faces Massive Shortage Risks Amid Heat And El Nino Impact Report 2026

ఇప్పటికే కరెంటు కష్టాలు

ఇటీవల వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే మొదటిసారిగా 270 గిగావాట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో, 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడం భారత్‌కు ఎంతో కీలకం. స్వచ్ఛమైన ఇంధనం ద్వారా మాత్రమే భవిష్యత్ అవసరాలను స్థిరంగా అందుకోవడానికి గ్రిడ్ వ్యవస్థను ఆధునీకరించడం, బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతపై పెట్టుబడులను వేగవంతం చేయడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+