వేణు స్వామి జాతకమే నిజం అయిందా.. విడాకుల బాటలో నయనతార..?
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.
నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది.

సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతారకు పెళ్లి తరువాత కష్టాలు మొదలవుతాయని .. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలోనే ప్రముఖ వేణు స్వామి చెప్పడం జరిగింది.
ఇప్పుడు దానికి తగినట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. సోషల్ మీడియాలో భర్త విఘ్నేష్ శివన్‌ను అన్‌ఫాలో చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే దీనిపై అటు నయనతార కానీ ఇటు విఘ్నేష్ శివన్ కానీ ఎవరూ స్పందించలేదు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
పొరపాటున ఇలా జరిగి ఉండవచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు టెక్నికల్ సమస్య వల్ల విఘ్నేష్ శివన్ పేరు కనిపించకపోవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏడేళ్లపాటు రిలేషన్‌లో ఉండి మరి విఘ్నేష్ శివన్‌ను నయనతార పెళ్లాడింది. 2022 జూన్‌లో వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిషుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications