Jabardasth ప్రోమోలో రోజా నవ్వులు ఎక్కడ..? అతను డుమ్మా

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్, ధనరాజ్, చంద్ర, వేణు,ఆది, అభి,వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మీ కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికి తెలిసిందే.

Jabardhasth 12th anniversary celebrations

ఇక టీఆర్పీ రేటింగ్స్ కూడా ఈ షో దూసుకుపోయింది. అంతలా హిట్ అయింది కాబట్టే జబర్దస్త్ షో రెండుగా చేసి ఎక్ట్సా జబర్దస్త్ అని సపరేటు షో చేశారు. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ షో పెద్దగా క్లిక్ కావడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ షో నుంచి తప్పుకున్న తర్వాత జబర్దస్త్‌ను ప్రేక్షకులు పెద్దగా చూడటం లేదు. ఇదే సమయంలో రోజా, నాగబాబు,గెటప్ శ్రీను ,షకలక శంకర్ వంటి వారు సైతం షోకు దూరం కావడం జబర్దస్త్‌కు మైనస్‌గా మారింది.

తాజాగా జబర్దస్త్ మొదలు పెట్టి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో , షో యాజమాన్యం ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. 12 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్థస్త్‌లో పని చేసిన ఆర్టిస్టులందరితో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ఎపిసోడ్‌ కోసమని జబర్థస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారందర్నీ కూడా పిలిపించడం జరిగింది. అనసూయ, గెటప్ శ్రీను, ధనరాజ్, చంద్ర, వేణు,ఆది, అభి, నాగబాబు మొదలగు వారందరూ కూడా ఈ ప్రోమోలో కనిపించారు. కానీ ఇద్దరు మాత్రం ఈ ప్రోమోలో మిస్ అయ్యారు. అందులో ఒకరు రోజా. జబర్థస్త్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది రోజా నవ్వే.

అలాంటి రోజా ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు దూరం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఆమె వేరే షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల జబర్థస్త్ స్పెషల్ ఎపిసోడ్‌కు రాలేకపోయారని తెలుస్తోంది.అలాగే సుడిగాలి సుధీర్ సైతం ఈ 12 సంవత్సరాల సెలబ్రేషన్స్‌కు హాజరుకాలేదు.సుధీర్ సైతం వేరే షోలలో బిజీగా ఉండటం వల్లనే రాలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వీరిద్దరు రాకపోయే సరికి జబర్దస్త్‌ సెలబ్రేషన్స్ పెద్దగా ఆకట్టుకున్నట్టు లేవని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+