అంబానీ పెళ్లి దెబ్బకు ఆస్పత్రిలో చేరిన జాన్వీ కపూర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుంటంతో ఆమెను ముంబైలోని ప్రముఖ హాస్పటల్‌లో చేర్పించినట్టు తెలుస్తోంది. అయితే జాన్వీకి అసలు ఏమైందనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అంబానీ పెళ్లిలో వెనుకా ముందు ఆలోచించకుండా ఫుల్‌గా లాగించేసి ఉంటుందని.. అందుకే ఫుడ్ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిందని కామెంట్స్ చేస్తున్నారు. అనంత్ అంబానీ పెళ్లిలో జాన్వీ తెగ హడావిడి చేసింది.

ఈ పెళ్లిలో రెండు, మూడు డ్రెస్‌ల్లో కనిపించిన జాన్వీ, తనదైన స్టేపులతో ఫుల్ జోష్‌లో కనిపించింది. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది.

Janhvi Kapoor hospitalised due to food poisoning

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది.

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. ఎన్టీఆర్‌తో ' దేవర ' తో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ తర్వాత రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నాని కొత్త సినిమాలో సైతం ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు సినిమాల్లో నటిస్తోంది అమ్మడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+