ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించిన జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించారు.
జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. ఇక ఈ ఏడాదే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతోంది. ఇదిలా ఉంటే జాన్వీ చేసిన పని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా సాంగ్ ప్రోమోకు మాత్రం జాన్వీ లైక్ కొట్టింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి తొలి సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఈ సాంగ్‌పై జాన్వీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ పాటకు లైక్ కొట్టి ఎన్టీఆర్‌ను అవమానించిందని.. సొంతం సినిమా కంటే మరో హీరో సినిమాపై అంత ఇంట్రెస్ట్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications