అందాల విందులో హద్దులు దాటుతున్న జాన్వీకపూర్
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. ఎన్టీఆర్ పక్కన తెలుగుచిత్రంలో నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని జాన్వీ వ్యాఖ్యానించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు కాగా నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిగా నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉండనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించపోతున్నారు. తన పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తన చిన్నతనంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా తనవి, తన చెల్లెలు ఫొటోలు తీసుకున్నారని, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్స్ లో పెట్టారని చెప్పింది. ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోలు నిజమైనవే అని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పది సంవత్సరాల వయసులోనే ఇంటర్నెట్ లో తన ఫొటోలు కనిపించాయని, ఆ వయసులో ఏం జరుగుతుందో, ఏమిటో తనకు అర్థం కాలేదన్నారు. ఈ విషయంలో తన స్నేహితులు కూడా ఎగతాళి చేశారని జాన్వీ వెల్లడించింది.

దేవరతోపాటు మరో రెండు తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా జాన్వీ అనుకుంటున్నారని, దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications