విజయ్ తనయుడి యాక్షన్ డ్రైవ్‌డ్ ఎంట్రీ: రిలీజ్ డేట్ లాక్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతను మెగా ఫోన్ పట్టిన తొలి చిత్రం సిగ్మా. ఈ ఫిల్మ్ విడుదల తేదీ ఖరారైంది. జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించాడు. అతని సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. కోరియోగ్రాఫర్ రాజు సుందరం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్యాథరిన్ థ్రెసా ఒక ప్రత్యేక పాటలో అలరించనుంది.

ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఓ యాక్షన్-డ్రైవ్‌డ్ పోస్టర్‌ను విడుదల చేశారు. సందీప్ కిషన్ భుజంపై రక్తం మరకలున్న పెద్ద పారతో, సీరియస్ లుక్స్ లో కనిపించాడిందులో. డార్క్ షేడ్ బ్యాక్ గ్రౌండ్, గ్రిట్టీ లుక్‌తో ఉన్న పోస్టర్ ఇది. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా రూపొందుతున్న సిగ్మా చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ లల్లో ఒకటైన లైకా నిర్మిస్తోంది. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు.

Jason Sanjay Son of CM Vijay directorial debut Film Sigma leade role Sundeep Kishan release date

థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్‌, సంజీవ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ట్యూనీ జాన్ పబ్లిసిటీ డిజైన్, హరిహరసూదన్ వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను చూసుకుంటున్నారు. జేసన్ సంజయ్ కు డెబ్యూ మూవీ కావడం, టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతోండటం, అదే స్థాయిలో టెక్నీషియన్స్ పని చేస్తోండటంతో సిగ్మా మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

జేసన్ సంజయ్ దర్శకత్వంపై విదేశీ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందాడు. ఆ తర్వాతే మెగా ఫోన్ పట్టాడు. 2020లో టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేసిన అతను, లండన్‌లో స్క్రీన్‌రైటింగ్‌లో బీఏ డిగ్రీని కూడా పొందాడు. గతంలో పలువురు నిర్మాతలు జేసన్‌ను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించారు గానీ సాధ్యపడలేదు. ప్రేమమ్, సర్వం మాయా, వాళా 2 వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మలయాళ టాప్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ కూడా జేసన్ కు కథ వినిపించారు గానీ అతనికి దర్శకత్వంపై ఉండే ఇష్టంతో అటు వెళ్లలేదు.

Take a Poll

'సిగ్మా' చిత్రం జూలైలో విడుదల కానుండగా, అందుకు ముందే జూన్‌లో విజయ్ నటించిన 'జననాయకన్' సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, బాబీ డియోల్ వంటి భారీ తారాగణం నటించింది. కేవీఎన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిజానికి ఈ ఏడాది పొంగల్ కే విడుదల కావాల్సిన 'జననాయకన్' సెన్సార్ సమస్యల కారణంగా ఆలస్యమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+