ఎన్టీఆర్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ లో ఎవరెక్కువ?
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ స్టార్ కథానాయకులే. వీరి సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లోనే ఉంటాయి. సినిమా బాగుంది అనే టాక్ వస్తే వారం రోజుల్లో సినిమాపై పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. వీరిద్దరి సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది సహజంగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్థాయికి, గ్లోబల్ హీరో స్థాయికి చేరుకోగా, అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి వచ్చాడు.
పుష్పకు ముందు రూ.40 కోట్లు
ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పుష్ప సినిమా ముందు వరకు అల్లు అర్జున్ రూ.40 కోట్లు తీసుకునేవాడు. పుష్ప పాన్ ఇండియా హిట్ అవడంతో రూ.100 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఆరు సినిమాలు హిట్లు కొట్టారు. ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. దేవర చిత్రానికికానీ, వార్2 కోసంకానీ, త్వరలో చేయబోయే ప్రశాంత్ నీల్ చిత్రంకానీ.. ఇలా ఏ సినిమా అయినా పారితోషికం రూ.100 కోట్లుగా ఉంటోంది. అంతేకాకుండా ఆ సినిమా నిర్మాణంలో కల్యాణ్ రామ్ బ్యానర్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ కూడా ఒక భాగస్వామిగా మారుతుంది.

నిర్మాణంలో భాగస్వామిగా
కొంతమంది స్టార్ కథానాయకుడు ఆడియో హక్కులు, డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, లాభాల్లో వాటాలు, ఓవర్సీస్ హక్కులు... అంటూ ఇలా తీసుకునేవారు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాకు గీతా ఆర్ట్స్ కూడా ఒక భాగస్వామిగా ఉండాలి. అట్లీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సన్ పిక్చర్స్ తోపాటు గీతా ఆర్ట్స్ ను కూడా ఒక భాగస్వామిగా చేశారు. దీనిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పారితోషికం తగ్గించుకొని లాభాల్లో వాటా తీసుకుంటే రెమ్యునరేషన్ రూపంలో వచ్చే అమౌంట్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఒక రూపాయి ఎక్కువే తీసుకుంటున్నాడని చెప్పొచ్చు. భవిష్యత్తులో వీరి పారితోషికాలు ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications