అందరికీ ఆహ్వానం అంటూనే ఆ ఇద్దరినీ పక్కకు నెట్టేశారు?

తాతమ్మ కల చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఈనెల 30వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు. ఇటువంటి అరుదైన ఘనతను ఆయన అమితాబ్ బచన్ తర్వాత దేశంలో రెండో వ్యక్తిగా నిలవబోతున్నారు. హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్రస్తుతం తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య రాజకీయాల్లోను హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. బాలయ్య గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల వేడుకను జరపాలని తెలుగు పరిశ్రమ పెద్దలు భావించి ఏర్పాట్లు చేస్తున్నారు.

వివాదాలకు అందరూ దూరంగా ఉండాలి
సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం ఆరుగంటలకు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. వేదిక ఇంకా ఖరారవలేదు. దీనికి సన్నాహక కార్యక్రమం తెలుగు ఫిల్మ్ చాంబర్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వివాదాలకు దూరంగా నిర్వహించాలని సూచించారు. పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని, అయితే ఫలానా హీరో రాలేదు.. ఫలానా హీరో వచ్చాడంటూ కొత్త కొత్త వివాదాలకు ఎవరూ తెరలేపవద్దని కోరారు. అందరినీ ఆహ్వానిస్తున్నామని, అయితే వారి వారి వెసులుబాటును బట్టి వస్తారని, ఒకవేళ పని ఒత్తిడిలో ఉండి రాకపోయినప్పటికీ ఎవరూ వివాదాలు రేకెత్తించవద్దన్నారు.

junior ntr and kalyanram distance from nandamuri Balakrishna 50 year golden jubilee celebration

అందరి ఆహ్వానిస్తున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కు మాత్రం ఆహ్వానం ఉండకపోవచ్చని, ఒకవేళ ఉన్నా వారిద్దరూ వచ్చే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నందమూరి కుటుంబాల్లోని ఇతర సభ్యులకు వీరిద్దరూ కొన్నాళ్లుగా దూరం ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా తారక్ స్పందించలేదు. వీరిద్దరికీ ఆహ్వానం అందాలా? వద్దా? అనే విషయంలో బాలయ్య జోక్యం చేసుకునే అవకాశం కనపడటంలేదు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం వీరిద్దరినీ పిలవాల్సిన అవసరంలేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తారక్ కొడాలి నానిని, వల్లభనేని వంశీని నియంత్రించకపోవడమే కాకుండా అందరికీ దూరం జరిగారు. ఇటువంటి పరిణామాల మధ్య తారక్ వచ్చే అవకాశం కనపడటంలేదు. దీంతో కొద్దిరోజుల నుంచి చర్చంతా వీరిద్దరిమీదనే నడుస్తోంది. ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదనుకుంటే తారక్, కల్యాణ్ రామ్ హాజరయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+