ప్రభాస్-జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు?

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సలార్ 2 త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతోంది. పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమగా డార్లింగ్ అంటూ ప్రభాస్ పిలుస్తుంటాడు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ప్రవర్తిస్తాడు. పరిశ్రమలోని అన్నివర్గాలవారు ప్రభాస్ తో కలపుగోలుగా ఉంటారు. ప్రభాస్ కూడా అంతే ఉంటాడు. ఒకరకంగా అజాత శత్రువు అని చెప్పొచ్చు. అటువంటి డార్లింగ్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటంలేదు అనే విషయం మీకు తెలుసా?

ప్రభాస్-తారక్ మధ్య మాటల్లేవనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు కాదులెండి.. కొద్దికాలం క్రితం ఒక మాట విషయమై వీరిద్దరూ ఆరు నెలలు మాట్లాడుకోలేదు. పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్న వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. పరిశ్రమలో ఉన్న ఓ డైరెక్టర్ వల్ల వీరిద్దరి మధ్య దూరం వచ్చిందంటారు. ఒకర్నొకరు ఆ మాటకు సంబంధించి సరిగా అర్థం చేసుకోలేకపోవడంతో ఆరునెలలు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఓ ఈవెంట్ కు హాజరయ్యే సమయంలో ఇద్దరూ అనుకోకుండా ఎదురుపడ్డారు.

junior ntr and prabhas did not talk for six months

ఆ తర్వాత అక్కడే కూర్చొని అసలు దీనికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకున్నారు. తర్వాత నుంచి ఇద్దరూ కలిసిపోయారు. ఇప్పటివరకు వారు మంచి స్నేహితులుగా చెలామణి అవుతున్నారు. విభేదాలున్నప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయనేదానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోందంటారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ దేవర చిత్రం చేస్తున్నారు. రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ కల్కి, రాజాసాబ్ తో బిజీగా ఉన్నాడు. సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ ఇద్దరూ బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+