తారక్ - సమంత కాంబోలో 4 సినిమాలు... అసలు విషయం గమనించారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్యూటీ సమంత కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. అవి.. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతాగ్యారేజ్. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా బృందావనం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో మరో హరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ రెండోసారి రామయ్యా వస్తావయ్య సినిమాతో జతకట్టారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

డిజాస్టర్ గా నిలిచిన రభస
ముచ్చటగా మూడోసారి రభస సినిమా చేశారు. ఈ సినిమాలో తారక్, సమంతతోపాటు ప్రణీత కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహించాడు. అంతకుముందు చేసిన కందిరీగ హిట్ కావడంతో తారక్ అతనికి అవకాశం ఇస్తే మంచి ఫ్లాప్ సినిమా బహుమతిగా ఇచ్చాడు. తర్వాత నాలుగోసారి జనతాగ్యారేజ్ లో తారక్, సమంత నటించారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు.

Junior NTR and Samantha acted together in four films

మరో హీరోయిన్ కచ్చితంగా ఉంటుంది
తారక్-సమంత జంటగా నటించి నాలుగు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే ప్రతి సినిమాలో మరో హీరోయిన్ ఉంది. కాజల్, శ్రుతిహాసన్, ప్రణీత, నిత్యామీనన్ నటించారు. ప్రస్తుతం తారక్ దేవర తర్వాత వార్2, డ్రాగన్, దేవర2 చేస్తారు. ఈ సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కడా సమంతకు అవకాశం లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రావడం కష్టమేనని అర్థమవుతోంది. అంతేకాకుండా మయోసైటిస్ సోకడంవల్ల చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నరకు పైగా గ్యాప్ ఇచ్చింది సమంత. ఇదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. ఈ సమయంలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు దూసుకువచ్చారు. దీంతో హీరోలు కూడా వారివైపే మొగ్గుచూపుతుండటంతో సమంతకు సినిమాలు రావడం కష్టంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+