జూనియర్ ఎన్టీఆర్ - వెంకటేష్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రావాల్సిన బ్లాక బస్టర్ సినిమా మిస్ అయింది. ఒకవేళ ఆ సినిమా కార్యరూపం దాల్చివుంటే రికార్డులు బద్దలు కొట్టివుండేది. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న తారక్, వెంకీ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు కృష్ణవంశీ మంచి ఫాంలో ఉన్న సమయంలో వెంకటేష్ - తారక్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ కు ప్లాన్ చేశారు. కథ కూడా ఓకే అయింది. కొన్ని మార్పు చేర్పులు చేయాల్సి ఉంది. హీరోలిద్దరికీ కథను వినిపించారు. అయితే ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. కృష్ణవంశీ విశ్వప్రయత్నం చేశారుకానీ కుదర్లేదు. అలాగే తారక్ తోనే రైతు పేరుతో కృష్ణ వంశీ మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే అది కూడా పట్టాలెక్కలేదు.
ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి వెంకీ తన తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనే యోచనలో వెంకీ ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. హిట్3 దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ మరో సినిమా చేయనున్నారు. సైంధవ్ పేరుతో ఒక ఫ్లాప్ ఇచ్చిన శైలేష్ ఎలాగైనా వెంకీకి మంచి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.

ఆ సినిమాకు పోటీగా వెళ్లొద్దు
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ వార్2 ఆగస్టు 14న విడుదల కాబోతోంది. 15వ తేదీన రజనీకాంత్ కూలీ విడుదల కాబోతోంది. అయితే ఆ సినిమాకు పోటీగా వెళ్లొద్దని, ఒకవేళ వార్2 వాయిదా పడితే ఆ తేదీలో మన సినిమా విడుదల చేయండి అంటూ రజనీకాంత్ నిర్మాతలకు సూచించారు. అయితే ఈ రెండు సినిమాలు పోటాపోటీగా 14, 15 తేదీల్లో విడుద కావడం ఖాయమైంది. ఏ సినిమా సంచలన విజయం సాధిస్తుందో చూడాలి. వార్2 నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అన్నింటికన్నా కియారా అద్వానీ బికినీ సన్నివేశం టీజర్ లో హైలైట్ గా నిలవడం విశేషం.












Click it and Unblock the Notifications