ఇప్పుడున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన హీరో ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ను నటన పరంగా వంక పెట్టడానికి వీల్లేదు. అన్ని రసాలను ఆయన అవలీలగా పోషిస్తారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసవరం లేదు. అలాగే ఆయన కుటుంబం నుంచే బాలకృష్ణ, హరికృష్ణ, కల్యాణ్ రామ్, తారకరత్న లాంటివారంతా నటులుగా ఉన్నారు. అలా ఎంతమంది ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఫేవరేట్ హీరో ఉంటారుకదా. కాకపోతే ఆయన అభిమాన హీరో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటివారు కాదు.

ప్రస్తుత తరంలో జూనియర్ ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే పిచ్చి అభిమానం. మహేష్ ను అన్న అన్న అంటూ పిలుస్తాడు. ప్రిన్స్ ప్రతి సినిమాను తారక్ చూస్తుంటాడు. భరత్ అనే నేను సినిమా వేడుకకు తారక్ ముఖ్యఅతిథిగా వచ్చారు. మహేష్ అన్న చెప్పడంవల్లే తాను గెస్ట్ గా వచ్చినట్లు ఆ వేదికమీద తారక్ చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటుడు కూడా ఇష్టపడే హీరో మహేష్ బాబు కావడం ఎంతో గర్వకారణమని ప్రిన్స్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు.

Junior NTR favourite telugu hero

తారక్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా తీయబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో విజయ దశమికి వాయిదా పడింది. అలాగే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మేకోవర్ కోసం జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రిన్స్ లుక్ చూసిన అభిమానులు తమ హీరో హాలీవుడ్ హీరోలకన్నా ధీటుగా ఉన్నాడని, వారెవరూ ఆయనతో సరిపోరని చెబుతున్నారు. ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+