మహేష్ బాబు వద్దంటే జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు!

సినీ పరిశ్రమలో ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని తయారయ్యే కథలు తర్వాత వేరే హీరోల వద్దకు చేరుకుంటాయి. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. ఆ హీరో కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, హీరోకు కథ నచ్చకపోవడంతోపాటు అనేక కారణాలు ఆ కథను తిరస్కరించేలా చేస్తాయి. చేయాలని బలంగా అనుకున్నప్పటికీ చేయడానికి వీలుపడదు. ఆ కథలతో వేరే హీరోలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సందర్భాలతోపాటు ప్లాప్స్ దక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి కోవలోనే ప్రిన్స్ మహేష్ బాబు వద్దన్న కథతో సినిమా చేసి జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం బృందావనం. వాస్తవానికి ఈ కథను మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని దర్శకుడు రాసుకున్నాడు. అయితే అనివార్య కారణాలతో మహేష్ బాబు చేయడానికి వీలుపడలేదు. దీంతో దర్శకుడు నిర్మాత దిల్ రాజుతో జూనియర్ ఎన్టీఆర్ కు కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. కాజల్, సమంత హీరోయిన్లుగా, ప్రకాష్ రాజ్, శ్రీహరి కీలకపాత్రల్లో నటించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని సందర్భాల్లో కొందరు హీరోలు వద్దన్న సినిమాలు తర్వాత వేరే హీరోలతో సూపర్ హిట్లుగా నిలిచాయి.

junior ntr got block buster hit with mahesh babu rejected movie brindavanam

వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు మహర్షి అనే సినిమా చేశాడు. అది కూడా మంచి సూపర్ హిట్ సాధించింది. తెలుగు పరిశ్రమలో దర్శకులు ముందుగా రాసుకున్న కథల్లో ఎక్కువ భాగం మహేష్ బాబు వద్దకే చేరుకుంటాయి. కానీ వాటిని అతను తిరస్కరించడంతో వాటిల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా కూడా నిలిచాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి తన లుక్ ను కూడా మార్చుకునే పనిలో ప్రిన్స్ ఉన్నాడు. అలాగే తారక్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+