అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ యంగ్ టైగర్ కు అరుదైన గౌరవం దక్కింది. 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్' లో సభ్యత్వం పొందారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఈ సందర్భంగా తారక్ కు సినీ ప్రముఖులు, అభిమానులు తారక్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించారు. అంకిత భావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకర్షించారని, తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారని అకాడమీ పేర్కొంది. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారని, ఇలాంటి గొప్ప నటీనటులకు యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. తారక్ తోపాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు కూడా ఇందులో స్థానం లభించింది. జూనియర్ అభిమానులు ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే జూనియర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా మొదటి భాగం విడుదల కానుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి వార్2 లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. సలార్ విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిమీదే ప్రశాంత్ నీల్ ఉండనున్నారు.












Click it and Unblock the Notifications