మెగాస్టార్ విషయంలో అదొక్కటే బాధ: కమల్ హాసన్ సంచలన పోస్టు..!
మలయాళ స్టార్ హీరో, మెగాస్టార్ మమ్ముట్టి కి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మభూషణ్ ప్రకటించింది. దీంతో మమ్ముట్టికి దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పద్మభూషణ్ అందుకున్న మమ్ముట్టికి తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ విషెస్ తెలిపారు. ఈ మేరకు కమల్ హాసన్ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
என்னுடைய பிரியத்துக்குரிய நண்பர் @mammukka அவர்களுக்கு பத்ம பூஷன் விருது அறிவிக்கப்பட்டுள்ளது. நாங்கள் இருவரும் சேர்ந்து நடித்ததில்லை. ஆனால், நான் அவரையும் அவர் என்னையும் தூர இருந்து ரசித்தும் ஒருவருக்கொருவர் நேரடியாக விமர்சித்துக்கொண்டும் ஒரு ‘கோப்பெருஞ்சோழன் பிசிராந்தையார்’…
— Kamal Haasan (@ikamalhaasan) January 25, 2026
" నా ప్రియమైన స్నేహితుడు మమ్ముట్టి కి పద్మ భూషణ్ అవార్డు దక్కడం సంతోషకరం. మేమిద్దరం కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ చాలా ఏళ్లుగా మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. ఒకరి సినిమాల్ని ఒకరు క్రిటిక్స్ గానూ ఉన్నాం. ఓ మమ్ముట్టి అభిమానిగా నేను సాధారణ ఫ్యాన్స్ మాదిరిగానే ఆనందం వ్యక్తం చేస్తున్నా. నా స్నేహితుడు మమ్ముట్టి ఇప్పుడు పద్మ భూషణ్ మమ్ముట్టిగా మారారు. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.." అని కమల్ హాసన్ పేర్కొన్నారు.

అయితే ఈ సుదీర్ఘ స్నేహంలో ఒక చిన్న బాధ ఉందని తన పోస్టులో కమల్ హాసన్ పేర్కొన్నారు. "మేమిద్దరం ఇంకాస్త ఎక్కువగా కలుసుకుని ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది" అని కమల్ అన్నారు. అయితే ఇద్దరు అగ్ర నటులు, అహం లేకుండా ఒకరినొకరు కలుసుకోలేకపోయామని బాధపడటం అభిమానులను కదిలించింది. ఇక "నా అభిమానులు మమ్ముట్టి అభిమానులుగా కూడా ఉండాలన్నదే నా కోరిక" అని కమల్ చెప్పడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించింది. 40 ఏళ్లుగా తెరపై కలవని ఈ 'ధ్రువ తారలు', రాబోయే కాలంలోనైనా ఒక మెగా హిట్ చిత్రంలో కలిసి నటిస్తారా..? అని ఫ్యాన్స్ లో సందేహం కలిగింది.












Click it and Unblock the Notifications