నాకు విషం ఇవ్వండి.. బ్రతకలేకపోతున్న - స్టార్ హీరో

చిత్ర పరిశ్రమలోనే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా కూడా రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో పరిస్థితులు భరించలేనివిగా ఉన్నాయని కన్నడ నటుడు దర్శన్ కోర్టు ఎదుట వాపోయాడు. దయచేసి కనీసం తనకు విషమివ్వండని.. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉందని చెప్పారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు.

కోర్టు విచారణలో దర్శన్ మాట్లాడుతూ.. చాలా రోజులుగా నేను సూర్యరశ్మి చూడలేదు. గదిలో గాలి లేనట్టుంది. వేసుకున్న బట్టలు దుర్వాసన వస్తున్నాయి. గదిలో ఫంగస్ తీవ్రత భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవించలేనని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, "అలాంటివి చేయడం కుదరదు, అది సాధ్యం కాదు" అని స్పష్టం చేశారు.

kannada-actor-darshan-shocking-comments-on-court-enquiry-goes-viral

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి, దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న కారణంతో.. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2024 జూన్‌లో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్టు తేల్చారు. ఈ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌.. నటి పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసులోనే అరెస్టైన దర్శన్‌ కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అంటూ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును కోరడంతో బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాలు చేయగా సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్‌ను రద్దు చేసింది. జేబీ పార్దివాలా, ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, "దర్శన్ బెయిల్‌పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అతను సెలబ్రిటీ కావడం వల్ల విచారణపై కూడా ప్రభావం చూపవచ్చు" అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో జైల్లో దర్శన్‌కు ఏ విధమైన ప్రత్యేక వసతులు ఇవ్వవద్దని జైలు అధికారులకు ఆదేశించింది. దీంతో అతన్ని తిరిగి అరెస్ట్ చేసి పరప్పన అగ్రహారం జైలుకు తరలించారు.

kannada-actor-darshan-shocking-comments-on-court-enquiry-goes-viral

జైలులో సౌకర్యాల కోసం విజ్ఞప్తి..

వీడియో కాన్ఫరెన్స్‌లో దర్శన్.. తనకు బెడ్, పరుపు వంటి కనీస సౌకర్యాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు. అలాగే తనను బళ్లారి జైలుకు తరలించవద్దని కూడా కోరాడు. ఇప్పటికే ఆరోగ్యం క్షీణిస్తోందని.. చేతులపై ఫంగస్ పెరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఇక కేసు విచారణలో భాగంగా, 13, 14వ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు పరిశీలించింది. అభియోగాల నమోదును సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+