నటి ఫ్యామిలీపై దాడి, కేంద్ర మంత్రిని కలిసి ?, రాహుల్ గాంధీ ఏం చెయ్యాలని అనుకుంటున్నారు ?
బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్‌లో హింసాత్మక ఘటన జరిగిన తర్వాత కన్నడ నటి హర్షిక పూర్ణాచ, భువన్ పొన్నన్న బుధవారం హుబ్బళిలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషిని కలిశారు. తన మీద దౌర్జన్యం చేసిన నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి నటి హర్షి, భువన్ దంపతులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాజ్ జోషిని నటి హర్షిక, భవన్ దంపతులు కలవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని నటి హర్షికకు హామీ ఇచ్చిన తరువాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హుబ్బళికి వచ్చిన కన్నడ నటి హర్షిక, భువన్ పొన్నన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చలు జరిపారు.

ఈ ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో వివరించాడు. నటి హర్షిక దంపతులతో మేము మీకు అండగా ఉన్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఈ దేశాన్ని మావోయిస్టు దేశంగా మార్చేందుకు ప్రయత్నాలను చూస్తుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో దేశాన్ని మావోయిస్టు దేశంగా మార్చబోతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రెండు బైక్‌లు, ఇళ్లు ఉంటే వాటిలో ఒకదాన్ని కాంగ్రెస్ తీసుకుంటుందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. దేశానికి సంపద సృష్టించే వారిపై కాంగ్రెస్ పార్టీ కక్షకట్టిందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఇలాగే వదిలేస్తే దేశానికి ఏదోఒక రోజు కీడు జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.
బెంగుళూరులో జరిగిన చీకటి సంఘటన గురించి నటి హర్షిక తన అనుభవాన్ని హుబ్బళిలో మీడియాతో పంచుకుంది. నటి హర్షిక మీడియాతో మాట్లాడుతూ కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ కుటుంబాన్ని ఓదార్చేందుకు తాము హుబ్లీళి వచ్చామని, మా సమస్యపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించామని, మా బాధ తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారని, కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని నటి హర్షిక తెలిపారు.

మా కుటుంబం ఎవరి జోలికి వెళ్లకుండా మా సొంత పనులు మేము చేసుకుంటున్నామని, మా గురించి అనవసరంగా కొంత మంది వచ్చి లేనిపోని రామాయణాలు చేస్తున్నారని నటి హర్షిక ఆరోపించారు. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు కొంత మంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారని, కన్నడ మాట్లాడినందుకు మాతో గొడవపడ్డారని, చాలా మంది గుమిగూడి మమ్మల్ని బూతులతో దుర్భాషలాడారని, మా బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని నటి హర్షిక ఆరోపించారు.
సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని నటి హర్షిక ప్రశ్నించారు. మంత్రి పర్యటన తమకు ఎంతో ధైర్యం తెచ్చిందని, మాపై జరిగిన హింస కేసును ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లామని, మేము సమస్యను ప్రస్తావించామని, ఎన్నికల అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన తర్వాత మాకు మరింత ధైర్యం వచ్చిందని నటి హర్షిక, భువన్ గౌడ అన్నారు.












Click it and Unblock the Notifications