Karthika deepam 2 December 11th:జ్యోత్స్నపై కార్తీక్ ఉగ్రరూపం..ఎందుకంటే..?

'కార్తీకదీపం 2' సీరియల్‌లో నేటి ఎపిసోడ్ (538వ ఎపిసోడ్) భావోద్వేగాలు, గంభీరమైన జీవిత సత్యాలు, మరియు బిజినెస్ డ్రామాతో ఉత్కంఠభరితంగా సాగింది. గత ఎపిసోడ్‌లో దీపను "సెకండ్ హ్యాండ్" అని జ్యోత్స్న వ్యక్తిగతంగా దాడి చేయగా, నేటి ఎపిసోడ్‌లో కార్తీక్ గట్టి సమాధానంతో జ్యోత్స్నకు షాకిచ్చాడు.

జ్యోత్స్నకు కార్తీక్ స్ట్రాంగ్ కౌంటర్
దీపనుద్దేశించి జ్యోత్స్న చేసిన "రెండో భర్త" వ్యాఖ్యలపై కార్తీక్ తీవ్రంగా స్పందించాడు. సమాజంలో భార్య చనిపోయిన భర్త ఆరు నెలల్లోనే రెండో పెళ్లి గురించి మాట్లాడితే తప్పు లేదని, కానీ భర్త పోయిన భార్య మాత్రం అలాగే ఉండాలని ఎందుకు కోరుకుంటారని జ్యోత్స్నను నిలదీశాడు.

Karthika deepam 2 Serial December 11th Episode 538 Here is todays full story

కార్తీక్ మాట్లాడుతూ..."భర్త పోయిన ఆడది పక్కింట్లో ఉంటే అలాగే ఉండాలని కోరుకుంటాం, అదే ఆడది మన తల్లి అయితే అది చావుకు మించిన బాధ," అని ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితాన్ని అర్థం చేసుకునేలోపే దీపకు పెళ్లి జరిగిందని, తాళి కట్టిన వాడు మోసం చేసి పారిపోయాడని కార్తీక్ వివరించాడు. "దీప విలువ ఏంటో తెలిసి నేను తన జీవితంలోకి వెళ్లాను.. మళ్లీ తను కార్తీక దీపంలా వెలిగింది. దీప నా భార్య.. నా ఇంటి దీపం, ఇది ఆ విధాత వేసిన ముడి," అని బలంగా చెప్పాడు. దీప రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటీ? అని జ్యోత్స్నను ప్రశ్నిస్తూ, "దీప మెడలో తాళి కట్టకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు," అని తేల్చిచెప్పడంతో జ్యోత్స్న నిర్ఘాంతపోయింది.

పెళ్లి దాకా వచ్చి తన పెళ్లిళ్లు చెడిపోవడం గురించి జ్యోత్స్నకు గుర్తు చేసి కార్తీక్ క్లాస్ పీకాడు. "ఎవరి కోసమో ఎవరి జీవితాలు ఆగవని," స్పష్టం చేశాడు. మరోసారి దీప జీవితం గురించి మాట్లాడితే క్షమించనని శివన్నారాయణ హెచ్చరించాడు.

జ్యోత్స్నకు డబుల్ షాక్: పారిజాతం మద్దతు!
ఈ డ్రామా తర్వాత కార్తీక్, దీపలు గులాబ్ జాంలు తీసుకురాగా, జ్యోత్స్న చేసిన దాంట్లో తప్పుంది అని పారిజాతం అనడంతో జ్యోత్స్నకు రెండవ షాక్ తగిలింది. పారిజాతం కార్తీక్‌ను మెచ్చుకోగా, "గులాబ్ జాం కంటే నీ మాటలే తీయగా ఉన్నాయని," శివన్నారాయణ పొగిడాడు. ఆ వెంటనే శివన్నారాయణ గులాబ్ జాంని పారిజాతంకు తినిపించగా, కార్తీక్ ఆ దృశ్యాన్ని ఫోటో తీయడం హైలైట్‌గా నిలిచింది. ఈ సంతోషకరమైన వాతావరణాన్ని జ్యోత్స్న అసూయతో చూసింది.

కాశీ నిర్లక్ష్యం - ఫుడ్ ట్రక్స్ దగ్గర రసాభాస
మరోవైపు, ఫుడ్ ట్రక్స్ ప్రారంభోత్సవం గురించి శ్రీధర్ చెబుతుండగా, పీఏగా చేరిన కాశీ ఫోన్‌లో ఛాటింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఫుడ్ ట్రక్స్ దగ్గర పరిస్థితిని చూడమని శ్రీధర్ ఆర్డర్ వేయడంతో కాశీ రగిలిపోయాడు.అక్కడ కాశీ, "మన ఏరియాలో మాత్రమే ఫుడ్ మిగిలిపోయిందని," చెప్పగా, శ్రీధర్ ఆ ఫుడ్‌ని అనాథాశ్రమాలకు పంపించే ప్లాన్ గురించి చెప్పాడు. దీనిపై కాశీ నిర్లక్ష్యంగా మాట్లాడుతుండగా, శ్రీధర్ కోపంతో మండిపడ్డాడు. శ్రీధర్ మాట్లాడుతుండగానే కాశీ ఫోన్ కట్ చేయడంతో ఆఫీసులో వివాదం మొదలైంది.

జ్యోత్స్న అన్న మాటలతో దీప బాధపడగా, "ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న లాంటివాళ్లు అలాగే మాట్లాడతారని," కార్తీక్ దీపను ఓదార్చాడు. మరోసారి ఎవ్వరూ మాట్లాడకుండా చేస్తానని కార్తీక్ దీపకు మాటిచ్చి, గులాబ్ జాం తినిపించాడు. కాశీ నిర్లక్ష్యం, శ్రీధర్ ఆగ్రహంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్‌లో కార్తీక్ తన కుటుంబం మరియు బిజినెస్‌లో ఎలాంటి మార్పులు తీసుకువస్తాడనే ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+