Karthika deepam 2 December 8th:కార్తీక్ దీపల మధ్య రహస్య చర్చ..!!
బుల్లితెర ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్న 'కార్తీకదీపం 2' సీరియల్‌లో నేటి ఎపిసోడ్ (535వ ఎపిసోడ్) భావోద్వేగాలు, మొండి నిర్ణయాలు, కుటుంబ రహస్యాల చుట్టూ తిరిగింది. శివన్నారాయణ ఇంటికి వెళ్లాలనే దీప మొండి పట్టుదల వెనుక ఉన్న అసలు కారణాన్ని ఊహించిన కాంచన చివరకు కోడలి నిర్ణయానికి అంగీకారం తెలిపింది. మరోవైపు, శ్రీధర్-కావేరిల బంధంలో కాంచన జ్ఞాపకాలు కలకలం సృష్టించాయి.
దీప మొండి నిర్ణయం: అత్తగారి కళ్లల్లోకి చూసి మాటిచ్చింది
గత ఎపిసోడ్‌లో శివన్నారాయణ ఇంట్లోకి వెళ్లొద్దని కాంచన, అనసూయలు చెప్పినా దీప వినకపోవడంతో నేటి ఎపిసోడ్ ఉద్రిక్తతతో మొదలైంది. దీపపై రగిలిపోయిన కాంచన ఆమె మాట వినడానికి నిరాకరించింది. తన బిడ్డపై తాను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నానని దీప బదులివ్వగా, "ఆశలు ఎవరైనా పెట్టుకుంటారు, నిలబెట్టుకోవాలి" అని కాంచన కరాఖండీగా అంటుంది.

దీంతో దీప, "మీ కొడుకు వారసత్వాన్ని మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది, కానీ నేను శివన్నారాయణ గారింటికి వెళ్లాల్సిందే," అని తేల్చి చెప్పింది. "నువ్వు పనిమనిషిని చేసిన ఇల్లు అది," అని కాంచన కోపంతో అడ్డుకోగా, దీప తీవ్రంగా స్పందించింది. తన జీవితాన్ని ఇచ్చిన కాంచన దంపతులకు సేవ చేసుకునే అవకాశం రావడం తన అదృష్టమని, అందుకే ఆ ఇంటికి వెళ్లడానికి ఒక ముఖ్య కారణం ఉందని చెప్పింది. ఆ కారణం ఇప్పుడు చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు 'మీ కోడలు ఇదంతా ఎందుకు చేస్తుందో అర్థమవుతుందని' అత్తగారికి మాటిచ్చింది.
"కడుపుతో ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. నేను సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటికి వెళ్లనివ్వండి," అని ప్రాధేయపడటంతో కాంచన మనసు కరిగిపోయింది. "నా కొడుకు, నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు. అప్పుడు కొడుకుని నమ్మాను, ఇప్పుడు కోడల్ని నమ్మి వదిలేస్తున్నా," అని కాంచన దీప నిర్ణయాన్ని అంగీకరించడంతో అత్తాకోడళ్లు కలిసిపోయారు.
శ్రీధర్-కావేరిల మధ్య కాంచన ప్రస్తావన
శ్రీధర్ ఫోన్‌లో కాంచన ఫోటో చూస్తూ బాధపడుతుండటాన్ని కావేరి గమనించి ఉలిక్కిపడింది. "మీరు కాంచన అక్క దగ్గరికి వెళ్లిపోతారా?" అని కావేరి అడగడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. తాను ఎవరినీ మరిచిపోలేనని శ్రీధర్ చెప్పినా, "మీరు నన్ను మరిచిపోయారు," అని కావేరి బాధపడుతుంది. కాంచనపై తనకు, కావేరిపై తనకు ద్వేషం లేదని శ్రీధర్ అంటాడు. అయితే, "కార్తీక్ డ్రైవర్‌గా బతకడానికి దీపే కారణం," అని చెబుతూ దీపపై ద్వేషం వ్యక్తంచేశాడు. "ఎవరూ క్షమించకపోయినా, నిన్ను మాత్రం వదిలిపెట్టను," అని కావేరికి మాటిచ్చాడు శ్రీధర్.
కార్తీక్-దీపల మధ్య రహస్య చర్చ
నానమ్మ దగ్గర పడుకోవడానికి ఇష్టపడని శౌర్య, 'జో గ్రానీ (పారిజాతం) చెప్పినట్లే అంతా జరుగుతోంది' అని నోరు జారడంతో పారిజాతం కుట్ర కార్తీక్‌కి స్పష్టంగా అర్థమైంది.అనంతరం దీపకు ధైర్యం చెబుతూ, కార్తీక్ తన కుటుంబ భయం గురించి మాట్లాడాడు. అప్పుడు దీప మరింత ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. "ఒకేసారి అత్తకి, తాతయ్యకి అమ్మమ్మ (దివంగత కోడలు) కలలోకి ఎందుకు వచ్చింది?" అని ప్రశ్నించింది.
"పారిజాతం గారే కాదు, జ్యోత్స్నే కాదు... వాళ్ల కుటుంబంలో చనిపోయిన వాళ్లంతా తిరిగి వచ్చినా మన బిడ్డ పాదాలు నేలకు తాకకుండా ఆపలేరు. అక్కడి దాకా వస్తే నాలోని అమ్మ అదిశక్తి అవతారం ఎత్తుతుంది," అని దీప బలంగా చెప్పింది. దీప ఇచ్చిన మాటపై తనకు నమ్మకం ఉందని, అయితే 'రాంగ్ రూట్‌లో వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని' కాంచన వార్నింగ్ ఇవ్వడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications