Karthika deepam 2 September 24 Episode:కార్తీక్ పై శ్రీధర్ ఫైర్..ఎమోషనల్‌గా సాగే నేటి ఎపిసోడ్..!!
తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న సీరియల్ కార్తీకదీపం-2.నిన్నటి ఎపిసోడ్‌లో, సుమిత్ర ఆహ్వానం మేరకు కార్తీక్, దీపతో పాటు కుటుంబమంతా ఆమె ఇంటికి భోజనానికి వెళ్తారు. అయితే, సుమిత్ర తన క్షమాపణకు ఒక షరతు పెడుతుంది. దశరథ ఛాతీలో దిగిన బుల్లెట్ ను దీపనే కావాలని కాల్చిందని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. దీనికి దీప వెంటనే "అవును" అని సమాధానం చెప్పి అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 24న ప్రసారమైన 471వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 24)లో..
దీప "అవును" అనగానే కార్తీక్, కాంచన, దశరథలు షాక్ అవుతారు. దీప చేయని తప్పును ఒప్పుకుంటుండటంతో కార్తీక్ ఆమెను అడ్డుకుంటాడు. "నీ భార్యను కాపాడటానికి సాక్ష్యాలు కొనుగోలు చేసావు" అని సుమిత్ర ఆరోపిస్తుంది. అయితే కోర్టులో కూడా కేసు నిలవలేదని, దీప తుపాకీ నుంచి బుల్లెట్ రాలేదని జడ్జి స్వయంగా చెప్పారని కార్తీక్ వాదిస్తాడు.

శ్రీధర్ కూడా దీప తప్పు ఒప్పుకుంటున్నప్పుడు అడ్డుకోకూడదని కార్తీక్‌తో అంటాడు. అందుకు కార్తీక్ ఫైర్ అవుతూ "ఆ రోజు ఏం జరిగిందో మాస్టర్, మీకు తెలియదు. మీరు మౌనంగా ఉండండి" అని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత సుమిత్ర, జ్యోత్స్న చేసిన తప్పులను ఒప్పుకున్నామని, కానీ కార్తీక్, దీపలు తమ తప్పులు ఒప్పుకోవడం లేదని అంటుంది. కార్తీక్ మాత్రం "చేయని తప్పును ఒప్పుకునే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేస్తాడు.దీంతో సుమిత్ర ఆగ్రహించి "దీప తప్పు ఒప్పుకుంటేనే క్షమిస్తాను, లేకపోతే మీరు ఈ ఇంట్లోంచి వెళ్లిపోండి" అని అంటుంది. కార్తీక్, దీప, కాంచనలు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంటికి వచ్చాక ఏడుస్తున్న దీపను కార్తీక్ ఓదార్చుతాడు. అదే సమయంలో శ్రీధర్ అక్కడికి వచ్చి, "రెండు కుటుంబాలు కలిసే మంచి అవకాశాన్ని పాడు చేశావు" అని కార్తీక్‌తో గొడవపడతాడు. దానికి కార్తీక్, "ఇప్పుడు చేయని నేరాన్ని ఒప్పుకుంటే రేపు కోర్టులో పారిజాతం, జ్యోత్స్న ఆ సాక్ష్యం చూపించి దీపకు మూడేళ్లు జైలు శిక్ష పడేలా చేస్తారు. చేయని తప్పును ఒప్పుకోవడం కూడా తప్పే" అని గట్టిగా బదులిస్తాడు. ఈ పరిణామాలతో తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.












Click it and Unblock the Notifications