గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేశ్.. పెళ్లైన మూడు నెలలకే
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేశ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్.
పెళ్లికి కొద్ది రోజుల ముందు కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది.మొత్తానికి గోవాలో డిసెంబర్ 12న ప్రేమించిన ప్రియుడుని కీర్తి సురేశ్ వివాహం చేసుకుంది. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేశ్ దగ్గరుండి చూసుకుంది.మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది.

పెళ్లైన వెంటనే 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సినిమాతో కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్ ఎంట్రీ కీర్తికి నిరాశనే మిగిల్చింది. ఇక 'బేబీ జాన్' ప్రమోషన్స అనంతరం కీర్తి తన భర్తతో కలిసి హానీమూన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. హానీమూన్ పీరియడ్ పూర్తి కాగానే తన తర్వాత సినిమాలపై కీర్తి ఫోకస్ పెట్టింది.
కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వర్ రీటా,కన్నివేది, సినిమాలు చేస్తోంది. తాజాగా కీర్తి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన తర్వాత సినిమాకు ఈ భామ ఓకే చెప్పింది. కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్‌కు జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ సినిమాలకు గుడ్ బై చెబుతుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా కీర్తి తన కొత్త సినిమాను ఓకే చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.పెళ్లైన మూడు నెలలకు కీర్తి తన సినిమాను అనౌన్స్ చేసింది.












Click it and Unblock the Notifications