జీప్ నడుపుతున్న కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో..
కీర్తి సురేష్ పేరు చెప్పగానే అందరికి మహానటి సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ నటన హైలెట్. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ జీవించేశారు. ఆ పాత్రతో ఆమె తెలుగుప్రేక్షకులకే కాకుండా యావత్ భారతవనికి దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించారు కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ జీప్ నడుపుతున్న వీడియో ఇప్పుడు ఒకటి సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చెన్నై బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ...:దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కీర్తి ఇటీవల భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించి అందరి మన్నలను పొందారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో పలు తమిళ సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజాగా కీర్తి సురేష్ చెన్నైలోని ఓ బీచ్లో మహీంద్రా థార్ నడుపుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. అయితే, మహానటి సినిమాలో కీర్తీ సురేష్ కారు నడపడం అందంరం చూశాం.

కానీ ఇప్పుడు ఏకంగా జీప్ నడుపుతూ తన అభిమానులకు షాక్ ఇచ్చింది కీర్తి.. బీచ్‌లో ఎంతో స్టైలిష్‌గా జీప్‌ను నడుపుతున్న ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టకుంది. అయితే, ఈ వీడియోను కీర్తిసురేష్ ఆదివారం సాయంత్రం సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు. చెన్నై బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కీర్తి సురేష్ టాలెంట్‌కు ఫిదా అయిపోయి, కీర్తి అదరగొడుతుందిగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications