నటిపై అత్యాచారం..పరారీలో మరో ప్రముఖ నటుడు..!

జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమా కమిషన్ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

Kerala Police issues arrest warrant against Malayalam actor Siddique

హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్థులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదికలో పేర్కొంది. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన ఓ నటి అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఓ తమిళ సినిమాలో అవకాశం రావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే సిద్ధిఖీ డిమాండ్లను నటి తిరస్కరించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపింది.

2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలోనే అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్ధిక్‌పై కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే సిద్ధిఖీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.మరోవైపు సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కేరళ హైకోర్టు దానిని కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+