గేమ్ చేంజర్ సినిమాపై కీలక అప్‌డేట్...త్వరలోనే షూటింగ్ కంప్లీట్..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక, ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి శంకర్ దర్వకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న చిత్రం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో నటి అంజలి, నటుడు శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య పలు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ఈచిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచిచూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై దర్శకుడు ఓ కీలక అప్‌డేట్‌ను అందించారు. ఇటీవల 'భారతీయుడు2' ప్రమోషన్స్‌లో పాల్గొన్న శంకర్.. 'గేమ్ చేంజర్' షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు మూవీ రిలీజ్‌పై ఓ కీలక అప్‌డేట్ అందించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఇంకా పదిరోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, తర్వలోనే మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలిపారు.

విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2' చిత్రం రిలీజ్ కాగానే 'గేమ్ చేంజర్' వర్క్‌ను పూర్తి చేస్తామని దర్శకుడు శంకర్ ఈ సందర్శంగా చెప్పారు. ఇక, గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ చూసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ఆయన అన్నారు. ఈ సంవత్సరంలోనే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్‌ఛేంజర్ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో తెరకెక్కబోతున్న చిత్రం. ఇక, ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications