కేజిఎఫ్ మూడో భాగం స్క్రిప్ట్ రెడీ... డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..?

కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ద‌క్కేలా చేసిన చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమా ఆ ఇండ‌స్ట్రీకి ఎంతో పేరు తెచ్చిందో, అందులోని న‌టీన‌టుల‌కు కూడా అంతే పేరుతెచ్చింది. ఒకే ఒక్క చిత్రంతో కేజీఎఫ్ న‌టుడు య‌ష్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. అంతేకాదు దీని రెండో భాగ‌మైన కేజీఎఫ్ 2 కూడా విడుద‌లయ్యి మంచి విజ‌యాన్ని సాధించింది. కెజీఎఫ్ రెండు పార్ట్‌లు బాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసాయి.

ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యి రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. అంతేకాదు, విడుద‌ల‌యిన ప్ర‌తి భాష‌ల్లోనూ రికార్డులు కైవ‌సం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కేజీఎఫ్ 3 గురించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ మూడో భాగం పనులు శ‌ర‌వేగంగా కొనసాగుతున్నాయని. త్వరలోనే స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

KGF third part script is ready do you know who the director is

అయితే, ఈ సినిమాకు ఎవ‌రు ద‌ర్శ‌కుడో తెలియద‌ని చెప్పారు. కానీ, కేజీఎఫ్‌లో మాత్రం య‌ష్ ఓ కీల‌క‌స‌భ్యుడ‌ని అన్నాడు. కేజీఎఫ్ 3కి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలియ‌ద‌ని ప్ర‌శాంత్ నీల్ అన‌డంతో య‌ష్ అభిమానుల‌కు మాత్రం కాస్త కంగారుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండు భాగాల్లో రికార్డుల వ‌ర్షం కురిపించిన ఈ చిత్రం.. మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే, కేజీఎఫ్ పార్ట్ 3 డైరెక్ట‌ర్‌పైనే కాస్త సందిగ్ధ‌త నెల‌కొంది. ఇక‌, ఈ మూవీ గురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న‌లు కూడా రానున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నెల‌ఖారు నుంచి స‌లార్ 2 రెగ్యులర్ షూటింగ్‌..

ఇక‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌తో పాటు స‌లార్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను కూడా అందించాడు. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ కూడా జ‌రుగుతోంది. అలాగే ఈ నెల ఆఖరు నుంచి సలార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుందని ద‌ర్శకుడ ప్ర‌శాంత్ నీల్ ఓ కార్య‌క్ర‌మంలో తెలిపారు. ఇక‌, ఈ సినిమాలో ప్ర‌భాస్‌తోపాటు చాలామంది స్టార్ హీరోలు కూడా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలోని ప్రభాస్ ఎంట్రీకి ప్రిన్స్ మ‌హేష్‌బాబు వాయిస్ ఇస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+