'మా నాన్న జీవించి ఉంటే బాగుండేది'.. అజిత్ ఎమోషనల్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోగా నిరూపించుకున్నారు అజిత్. ఇటీవల ఆయన దుబాయ్ కార్ రేస్ ఈవెంట్ లో పాల్గొని విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అజిత్ రేసర్ల గ్రూప్ నాయకుడు కావడంతో ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందుకే రేసులో విక్టరీ సాధించాడు. అయితే తాజాగా అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని అందించింది. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించింది. దీనిపై అజిత్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
'నన్ను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి ధన్యవాదాలు. ఈ గుర్తింపు వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నాను. కెరీర్లో ఇండస్ట్రీ నుంచి నాకు ఎంతో మద్దతు దక్కింది. పరిశ్రమలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. వారందరి ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్‌లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు' అని పోస్ట్ చేశారు. అజిత్ కు పద్మభూషణ్ రావడంతో అనేకమంది సెలబ్రిటీలు, రేసింగ్ స్టార్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. కంగ్రాట్స్ అజిత్ అని కామెంట్స్ చేస్తున్నారు.

అజిత్ ఎమోషనల్
తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన క్రమంలో తన తండ్రి జీవించి ఉంటే బాగుండేదని అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఆయన భౌ తికంగా లేకపోయినా.. ఎప్పుడూ తమ మధ్యే ఉంటారని అన్నారు. 'నా భార్య షాలిని సహకారంతోనే ఇలా ఉన్నాను. ఇక నా ఫ్యాన్స్ ప్రేమ, ప్రోత్సాహం నేను మరువలేను. ఈ అవార్డు మీ అందరిది' అని అజిత్ ఎమోషనల్ అయ్యారు.












Click it and Unblock the Notifications