బాహుబలి, RRR కూడా ఆ సినిమా రికార్డ్ ను టచ్ చేయలేకపోయాయి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ సినిమాల్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులను భవిష్యత్తులో ఎవరూ అధిగమించడం కూడా కష్టం. అనేక రికార్డులను తిరగరాసిందని అభిమానులు సంబరపడ్డారు. బాహుబలి2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా నిలిచింది. అయితే బాహుబలి2కానీ, ఆర్ఆర్ఆర్ కానీ ఓ సినిమా రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి.
సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సినిమా
దాదాపు 41 సంవత్సరాల క్రితం కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా ముందడుగు విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి కె.బాపయ్య దర్శకుడు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించారు. ముందడుగు విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్ లోను 50 రోజులు పూర్తిచేసుకున్న మొదటి మల్టీస్టారర్ గా నిలిచింది. 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించడంతో ప్రేక్షకులు విరగబడి చూశారు.

హిందీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది
తర్వాత ఇదే సినిమాను హిందీలో మక్సద్ పేరుతో రీమేక్ చేశారు. రాజేష్ ఖనా, జితేంద్ర కథానాయకులుగా నటించారు. ఈ సినిమాకు కూడా బాపయ్యే దర్శకత్వం వహించారు. తెలుగులో హీరోయిన్లుగా నటించిన శ్రీదేవి, జయప్రద హిందీలో కూడా నటించారు. అక్కడ ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ముందడుగు విడుదలైన తర్వాత ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయికానీ ఏ సినిమా కూడా విడుదలైన ప్రతి థియేటర్ లో 50 రోజులు పూర్తిచేసుకోలేదు. రెండు వారాలు లేదంటే మూడువారాలు ప్రదర్శితమయ్యేవి. ఆరోజులుగా విడుదలయ్యే సినిమాలు ముందుగా తక్కువ థియేటర్లలో విడుదలై బాగుందనే టాక్ వస్తే నెమ్మదిగా థియేటర్ల సంఖ్యను పెంచుకునేవి. ముందడుగు అలా కాకుండా నేరుగా విడుదలైన అన్ని థియేటర్లలో అర్థశతదినోత్సవాన్ని జరుపుకొని రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications