శుభవార్త చెప్పిన లావణ్య త్రిపాఠి ..ఎదురుచూస్తున్న రోజు వచ్చేసిందంటూ పోస్ట్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.
నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.

ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇటీవలే భర్త వరుణ్ తేజ్‌తో హానీమూన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది.
తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైట్ పింక్ కలర్ చీర కట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ... అమ్మ పింక్ రూబీ స్టడ్‌లు(చెవి దిద్దులు) ధరించాను. చిన్ననాటి జ్ఞాపకాలకు ఇవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అవన్నీ నావే అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications