బాలీవుడ్ బ్యూటీ, ఎంపీ కంగనా రనౌత్ పై లాయర్ల సంఘం సీరియస్, కేసు పెట్టాలి అంతే !
నటి, ఎంపీ కంగనా రనౌత్ ఒక నిర్దిష్ట సమాజంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) సభ్యుల ప్రతినిధి బృందం పంజాబ్ లోని మోహాలి జిల్లా పోలీసులకు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే కంగనా రనౌత్ మీద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఐఏఎల్ పంజాబ్ యూనిట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు దర్శన్ సింగ్ ధాలివాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిల్లా ఎస్పీ తుషార్ గుప్తాను కలిసి నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.జూన్ 6వ తేదీన సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను రనౌత్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆమెను దూషించారని, ఇంత జరగడానికి కంగనా రనౌత్ కారణమైందని ధలీవాల్ ఆరోపించారు.

పంజాబ్ రాష్ట్ర మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి నటి కంగనా రనౌత్ ప్రయత్నించిందని, ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలి అని ధాలివాల్ డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ (హెచ్‌పీ)లోని మండి నుండి కొత్తగా ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా దాటుతుండగా లేడీ కానిస్టేబుల్ రనౌత్‌ను కొట్టారు. సీఐఎస్ఎఫ్ అధికారుల ఫిర్యాదు మేరకు కుల్వీందర్‌పై కేసు నమోదు చేశారు. ఆమెపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది.
నటి కంగనా రనౌత్ ఓ మహిళా పోలీసుల మీద దురుసగా ప్రవర్తించారని, అందరి ముందు ఆమెను దూషించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మహిళా పోలీసు పోలీసు పంజాబ్ కు చెందిన మహిళ అయినందున ఆమెను చిన్నచూపు చూస్తున్నారని, నటి కంగనా రనౌత్, బీజేపీ నాయకులు కలిసి ఆమె ఉద్యోగం నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారని పంజాబ్ లోని న్యాయవాదుల సంఘం, పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications