లెజెండరీ గాయని "ఆశాభోస్లే" ఎవరి పాటలు వింటారో తెలుసా..?
లెజెండరీ గాయని ఆశా భోస్లే మరణం భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతుంది. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ, సంగీత ప్రపంచం షాక్‌కు గురైంది. పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆశా భోస్లే అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
1933లో సంగీత సంప్రదాయానికి నిలయమైన మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, చిన్న వయస్సులోనే గానప్రస్థానం ప్రారంభించారు. అక్క Lata Mangeshkarతో కలిసి భారతీయ సంగీతానికి రెండు కళ్లుగా నిలిచిన ఆమె, 1943లో తొలి పాటను రికార్డ్ చేసి సినీరంగంలో అడుగుపెట్టారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో వేల సంఖ్యలో పాటలు పాడి Guinness World Recordsలో స్థానం సంపాదించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో ఆమె స్వరం మార్మోగింది. మెలోడీ పాటల నుంచి క్యాబరే, క్లబ్ సాంగ్స్ వరకు ప్రతి శైలిలోనూ ఆమె తన ముద్ర వేసింది.

అలానే "దిల్ చీజ్ క్యా హై", "మేరా కుచ్ సామాన్" వంటి పాటలకు రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గాయని అవార్డును గెలుచుకుని తన ప్రతిభను నిరూపించారు. సంగీత దర్శకుడు R. D. Burmanతో ఆమె చేసిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. "దమ్ మారో దమ్", "పియా తూ అబ్ తో ఆజా", "చురా లియా హై తుమ్నే" వంటి పాటలు తరతరాలకు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ జంట భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
వారి పాటలు వింటా..
గతంలో మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలో తనను తాను నిత్య విద్యార్థిగా భావిస్తానని వెల్లడించారు. పాటలు వినాల్సి వస్తే భీమ్‌సేన్ జోషి వంటి దిగ్గజాల పాటలు వింటానని తెలిపారు. వాటి ద్వారా తన గాన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సాధన చేస్తానని పేర్కొన్నారు. నేటి తరం గాయకుల్లో సునీధి చౌహాన్, రాహత్ ఫతే అలీ ఖాన్ వంటి వారి పాటలు బాగుంటాయని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications