థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో అంతకుమించిన విధ్వంసం..!

కొన్ని సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కానీ ఓటీటీలో మాత్రం ప్లాఫ్ అవుతుంటాయి. మరికొన్ని చిత్రాలు థియేటర్లలో ప్లాఫ్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ ఓటీటీలో మాత్రం హిట్ అవుతుంటాయి. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' మూవీ ఒకటి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10న గ్రాండ్ గా రిలీజైంది. విలేజ్ బ్యాక్​ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. కెరీర్​ లో తొలిసారి రూరల్ కుర్రాడి పాత్ర పోషించిన అఖిల్ నటనలో అదరగొట్టారు.

ఈ మూవీతో అక్కినేని అఖిల్ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమా కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 భారీ ధరకు దక్కించుకుంది. అలా ఆగస్టు 7న జీ5 లో స్ట్రీమింగ్‌ కు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ను దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఏ రేంజ్ లో అయితే విధ్వంసం సృష్టించిందో ఓటీటీలోనూ అదే రేంజ్ లో రికార్డులు కొళ్లగొడుతోంది.

Lenin movie creates a sensation on ZEE5 100 million streaming minutes in just two days akkineni

లెనిన్ మూవీకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ ప్రైజెస్ ఎల్ ఎల్‌ పీ, సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో 18 రోజులపాటు జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఈ మూవీలో తన ప్రాణ స్నేహితుడి ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి..? అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? రామచంద్రపురంలో జరిగిన ఘర్షణలో చివరికి ఎవరు గెలిచారు..? అనేది కథలోని ప్రధాన అంశాలుగా నిలుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+