Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వీటీ కొత్త సినిమా, అకాశాన్ని తాకిన అనుష్క క్రేజ్, మాస్క్ వేసుకున్నా వదల్లేదు రా !

కర్ణాటక కోస్తా బ్యూటీ అనుష్కా శెట్టి అలియాస్ అనుష్కా అలియాస్ స్వీటీ ఈ మధ్య సినిమాల్లో నటించడం చాలా తక్కువ అయ్యింది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో సంచలనం సృష్టించిన కర్ణాటక బ్యూటీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అయితే స్వీటీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కొన్నాళ్లుగా అనుష్కా పబ్లిక్‌గా కనిపించడం లేదు. అనుష్క చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కనిపించింది.

ఈ చిత్రం విభిన్నమైన ప్రయత్నాలకు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ మధ్య కాలంలో స్వీటీ సినిమాల్లో నటించడం తగ్గించేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. సైజ్ జీరో సినిమా విషయంలో చేసిన పొరపాటు వల్లనే ఇలా జరిగిందనే వారూ ఉన్నారు. నిశ్శబ్దం ప్రమోషన్ తర్వాత అనుష్క ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని ఆమె సొంత ఊరిలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుష్క పాల్గొనడంతో ఆ ఫొటోలు మాత్రమే వైరల్ అయ్యాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి షూటింగ్ సమయంలో పబ్లిక్‌గా అనుష్క ఎక్కడా కనిపించలేదు.

 Local fans are competing to see the sweetie Anushka, who has gone to Odisha for a film shoot

ఈ మధ్య అనుష్క ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అనుష్క అప్పుడప్పుడు బయటకు వచ్చినా మాస్క్ వేసుకుని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం స్వీటీ ఒడిశాలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఒడిశాలోని జైపూర్‌లో అనుష్క కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వీటీ నటిస్తున్న కొత్త సినిమా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు.

అయితే అనుష్క క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా సపోర్ట్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని డియోమాలి కొండల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైందని, జైపూర్ టౌన్ ప్రధాన రహదారి, సూర్య మహల్, జయనగర్ ప్రాంతంలోని జగన్నాథ్ సాగర్ సమీపంలోని పార్కులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. డియోమాలిలో కూడా చిత్రీకరించే అవకాశం ఉంది.

స్వీటీ, రమ్యకృష్ణ 8 రోజుల పాటు స్థానిక హోటల్‌లో బస చేయనున్నారు. అనుష్కకి ఒడిశాలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. షూటింగ్ సెట్‌లో అనుష్కను చూసేందుకు అభిమానులు గుమిగూడిన వీడియో వైరల్ అవుతోంది. అదే కారణంతో చిత్రబృందం కట్టుదిట్టమైన భద్రతతో సినిమాను తెరకెక్కిస్తోంది. ఇన్ని భద్రతలు ఉన్నప్పటికీ అనుష్క మాస్క్ వేసుకుని తిరుగుతున్న ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పేరు ఇంకా నిర్ణయించని ఈ సినిమా కోసం పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఓ హోటల్‌ మొత్తం బుక్ చేశారు.

అనుష్క, రమ్యకృష్ణ ఇప్పటికే చిత్రకూట్, తిరత్‌గఢ్‌లలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారని స్థానిక మీడియా తెలిపింది. సైజ్ జీరో' పాత్ర కోసం అనుష్క బరువు పెరిగింది. కానీ ఒక్కసారిగా బరువు పెరిగిన అనుష్క తరువాత అనుకున్న సమయంలో ఆమె బరువు తగ్గలేదని టాక్ ఉంది. స్వీటీ అనుష్క మళ్లీ మునుపటి ఫిజిక్‌కి రాకపోవడంతో సినిమాల్లో నటించలేక పోతోందని సినీ వర్గాలు అంటున్నాయి. స్వీటీ ఎక్కువగా పబ్లిక్‌ లో అందుకే కనిపించడం లేదని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వీటీ వ్యక్తిగత కారణాల వలన తానే కావాలని సినిమాలు తగ్గించానని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+