గంటకు 42 వేల టికెట్స్.. ఇదెక్కడి మాస్ రా మామా.. వార్ 2, కూలీ ని దాటేసి..
మహావతార్ నరసింహా.. ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా రిలీజైన మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఈ సినిమా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందర్నీ ఆకర్షించి వసూళ్ల వేటలో దూసుకెళ్తోంది. ఎవరికీ ఊహకందని రేంజ్ లో ఈ మూవీకి కలెక్షన్స్ వస్తున్నాయి. జులై 25 న ఈ మూవీ విడుదల కాగా ఆగస్టు 9 నాటికి రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం 100 ఏళ్ల ఇండస్ట్రీలో ఇదే తొలిసారని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను ఈ మూవీ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. కానీ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే మాత్రం పదింతలు ఉంది. అంతే కాక.. ఇండియా లో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై సినిమా నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా అన్ని థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ఆడుతుందని.. దీని ఓటీటీ డీల్స్ ను ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది.

ఇక బుక్ మై షో యాప్ లో అయితే ఈ మూవీ వీరవిహారం చేస్తోంది. గంటకు 42 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైతున్నాయి. ఇక ఆగస్టు 14న విడుదల కానున్న కూలీ చిత్రానికి గంటకు 17 వేల టిక్కెట్లు అమ్ముడుపోతుండగా.. వార్ 2 చిత్రానికి గంటకు రెండు వేల టికెట్స్ అమ్ముడవుతున్నాయి. రిలీజై 17 రోజులు అవుతున్నా ఈ మూవీకి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంక ఫుల్ రన్ లో ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ లు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications