ఆయన అంటే సమంతకు వణుకు.. అసలు విషయాలు బయటపెట్టిన స్టార్ హీరో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఏం మాయ చేసావే' అంటూ తెలుగు సినీ అభిమానుల మనసు దోచేసిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తన అద్భుతమైన నటనతో, అందంతో అగ్ర కథానాయికగా ఎదిగింది. తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది. ఇటీవలే సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై 'మా ఇంటి బంగారం' అనే సూపర్ హిట్ సినిమాను నిర్మించి.. అందులో పవర్ ఫుల్ పాత్రలో నటించి అభిమానులను అలరించింది.

ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ నీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రముఖ కన్నడ నటుడు, స్టార్ హీరో కిచ్చా సుదీప్.. గతంలో 'ఈగ' సినిమా షూటింగ్ సమయంలో సమంత పడిన టెన్షన్.. ఆమె ఎదుర్కొన్న భయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను, టాప్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు. సమంత స్టార్ డమ్ ను సొంతం చేసుకోకముందు సెట్స్‌లో ఎలా ఉండేదో ఆయన ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Samantha Feared Rajamouli Kiccha Sudeep Reveals Top Secrets From Eega Movie Sets Full Details

సమంత సినిమా కెరీర్లో ఈగ మూవీ ఓ మైలురాయిగా నిలిచింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో నాని, సమంత, కిచ్చా సుదీప్ ప్రధాన పోత్రలు పోషించిన సంగతి తెలిసిందేయ ఈ సినిమా గురించి సుదీప్ మాట్లాడుతూ.. అప్పటికి సమంత ఇండస్ట్రీకి కొత్త కావడం.. దానికి తోడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పర్ఫెక్షన్ కోసం ఆరాటపడుతుండటంతో.. షూటింగ్ సమయంలో సమంత విపరీతమైన టెన్షన్ పడేదని.. జక్కన్నను చూస్తే చాలా భయపడేదని సుదీప్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Samantha Feared Rajamouli Kiccha Sudeep Reveals Top Secrets From Eega Movie Sets Full Details

లోపల ఎంత భయమున్నా, ఒత్తిడి ఉన్నా.. సమంత బయటకు మాత్రం ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు చిందిస్తూ అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేదని సుదీప్ ప్రశంసించారు. అయితే ఆ సమయంలో తనకు కూడా తెలుగు, తమిళ భాషల్లో డైలాగులు చెప్పడం పెద్ద సవాలుగా ఉండేదని.. అందుకే షూటింగ్ సెట్‌లో తన ఫోకస్ మొత్తం డైలాగులు నేర్చుకోవడం పైనే ఉండేదని ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే 'ఈగ' షూటింగ్ సెట్స్ లో సమంతతో తాను ఎక్కువగా మాట్లాడలేకపోయానని.. కేవలం సాధారణ పలకరింపులకే పరిమితమయ్యామని సుదీప్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం కూడా తామిద్దం కేవలం రెండు మాడు సార్లు మాత్రమే కలుసుకున్నామని కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. కానీ సమంతలోని అంకితభావం, కష్టపడే తత్వం, నటనపై ఉన్న శ్రద్ధ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు కెమెరా ముందుకు రావడానికి పెద్ద దర్శకులను చూసి భయపడిన ఓ సాధారణ హీరోయిన్ స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా స్టార్ గా.. ప్రొడ్యూసర్ గా ఎదిగిన సమంత జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+