ద్రోణి ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వరుసగా వచ్చే ఏడు రోజుల పాటు ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు... పలు ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని సూచించారు. రుతుపవనాలతో పాటుగా ద్రోణి ప్రభావంతో వర్షాలు కరుస్తున్నాయని వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు సమాచారం అందించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపుల తో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

 TGSRTC లో పోస్టుల భర్తీ, 10 పాసైతే చాలు - పరీక్ష లేకుండానే..!!
TGSRTC లో పోస్టుల భర్తీ, 10 పాసైతే చాలు - పరీక్ష లేకుండానే..!!
imd-issues-yellow-alert-for-many-parts-of-telangana-predicts-heavy-rains-for-next-seven-days

వారం రోజుల పాటు వరుసగా వర్షాలు

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో గాలుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+