15 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు వసూలు .. బాక్సాఫీస్ ఊచకోత

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యానిమేషన్ సినిమాలకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా సాధించిన విజయం కేవలం బాక్సాఫీస్ గణంకాలకే పరిమితం కాకుండా, యానిమేషన్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆలోచనను పూర్తిగా మార్చివేసింది. కేవలం రూ.15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఒక యానిమేటెడ్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి.

సినిమా క్లోజింగ్ కలెక్షన్లు రూ. 300 కోట్లుగా ఉంటాయని సినీ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అంశాలు దాని అద్భుతమైన విజువల్స్ మరియు ఆకట్టుకునే కథాంశం. దర్శకుడు అశ్విన్ కుమార్ నరసింహ స్వామి, ప్రహ్లాదుడి పౌరాణిక కథను అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో, ఉత్తేజపూరిత సన్నివేశాలతో ఆవిష్కరించారు. ముఖ్యంగా నరసింహ స్వామి అవతారం, హిరణ్యకశిపుడితో జరిగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

Mahavathar Narasimha Animation Film A Landmark Success with 250 Cr Worldwide Box

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా, పిల్లలతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించడంలో విజయం సాధించింది. ఇది 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో మొదటి భాగం అని ప్రకటించడం, భవిష్యత్తులో మరిన్ని పౌరాణిక యానిమేషన్ చిత్రాలు వస్తాయనే ఆశను రేకెత్తించింది. ఈ విజయం భవిష్యత్తులో భారతీయ యానిమేషన్ చిత్రాలకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించిందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+