పవన్ కల్యాణ్ గుట్టురట్టు చేసిన ఫ్యాన్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాజానగరం సభలో పవన్ ప్రసంగిస్తూ.. 2014 ఎన్నికల తరువాత టీడీపీతో విభేదించి బయటకు వచ్చిన తరువాత తన సినిమాలకు ఎటువంటి అటంకాలు కలిగించలేదని పవన్ చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నా సినిమాలతో పాటు, సినిమా ఇండస్ట్రీపైనే జగన్ కక్ష్య పెంచుకున్నారని పవన్ తెలిపారు. టికెట్ల రేట్లు పెంచాలని వెళ్లిన తన అన్న చిరంజీవిని జగన్ ఘోరంగా అవమానించారని ఆయన తెలిపారు.
ఈ సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తావనను తెర మీదకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరువాత ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన వెంట నడించిందని పవన్ చెప్పారు. కృష్ణ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన సినిమాలకు ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించలేదన పవన్ చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మహేష్, కృష్ణ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత టాప్ హీరోలుగా వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ మాత్రం టీడీపీలో చేరడానికి ఇష్టపడలేదనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ సమయంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ కొన్ని సినిమాలను కూడా తెరకెక్కించారు. .గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం మొదలైనవి.మండలాధీశుడులో అన్నగారిని పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు చేయడం వల్ల అప్పట్లో ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుని కొన్నేళ్లు అవకాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు సైతం పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఈ సినిమాల విడుదల సమయంలో ఎన్టీఆర్ కొన్ని ఇబ్బందులకు గురి చేశారనే విషయం ఇండస్ట్రీ మొత్తం తెలుసు.
ఇక అక్కినేని నాగేశ్వరరావు అయితే ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఆలోచనలు మంచివి కావు..అందుకే నేను ఆ పార్టీలో చేరలేదని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలను అన్నీంటిని కూడా బయటకు వెలికి తీస్తూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మహేష్ అభిమానులు కౌంటరిస్తున్నారు . కృష్ణ పేరును రాజకీయంగా వినియోగించుకోవడాన్ని ఆయన అభిమానులు తప్పుపడుతున్నారు.












Click it and Unblock the Notifications