2.50 ఎకరాలు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ఎంతంటే?
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు పరిశ్రమలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా మారారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయనప్పటికీ ఆ స్థాయికి మించి రెమ్యునరేషన్ తోపాటు అభిమానులను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారుతున్నారు. ఇటీవలే విడుదలైన గుంటూరు కారంతోపాటు సర్కారువారిపాట, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు అతని స్థాయికి తగ్గట్లుగా హిట్ కాకపోయినప్పటికీ ప్రిన్స్ కు ఉన్న ఇమేజ్ ఆధారంగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి.
సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లోకి మళ్లిస్తున్న మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ శివారు శంకర్ పల్లి సమీపంలోని గోపులారం పరిధిలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీని విలువరూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన భార్య నమత్ర శిరోద్కర్ వెళ్లారు. ఆరోతేదీన శంకర్ పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో నమ్రత పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారు.

ఏఎంబీ మాల్ తోపాటు పలు రెస్టారెంట్లలో కూడా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖరీదైన భూములను ప్రిన్స్ కలిగివున్నారు. సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ యాజమాన్యం, ఏషియన్ సంస్థతో కలిసి మరో మాల్ నిర్మించబోతున్నారు.
చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని, గుంటూరు జిల్లాలోని స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో దీన్ని తీస్తున్నారు. రాజమౌళి సినిమాతోకన్నా ముందుగానే ఈ యాడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాడంటూ ప్రిన్స్ అభిమానులు సంబరంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications