నువ్వు.. నేను.. 20 వసంతాలు.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ సర్వసాధారణం. చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆ జంటల్లో మొదటగా గుర్తొచ్చే జంట మహేశ్- నమ్రత. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత వివాహబంధంలోకి అడుగుపెట్టి నేటికి(ఫిబ్రవరి 10) 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నువ్వు, నేను, బ్యూటిపుల్ 20 వసంతాలు.. ఎప్పటికీ నీతోనే నమ్రత" అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అటు మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
2000లో వంశీ చిత్రంలో మహేశ్, నమ్రత హీరోహీరోయిన్లుగా నటించారు. అక్కడి నుంచి వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఫిబ్రవరి 10, 2005లో ముంబయిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. నమ్రత.. మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఆమె సినిమాల్లోకి రాకముందే మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వివాహం తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు. సితార, గౌతమ్.. గౌతమ్ విదేశాల్లో ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. ఇక సితార సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ను సంపాదించింది.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications