డిసెంబరు 25న కలవబోతున్న మహేష్ బాబు, రామ్ చరణ్, తారక్
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏడాదికి 6 సార్లు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ నిమిత్తం వెళతాడు. తన పిల్లల స్కూల్స్ కు సెలవులు ఎప్పుడిస్తారో చూసుకొని దానికి తగ్గట్లుగా వారితో గడపడానికి మంచి నాన్నలా సమయం గడుపుతారు. సినిమాల షూటింగ్ కు ఇబ్బంది లేకుండా ముందుగానే తాను నటించే చిత్ర యూనిట్ కు చెప్పేస్తుంటాడు.
ఈసారి కూడా మహేష్ విదేశాలకి టూర్ వెళతాడంటున్నాడు. క్రిస్మస్ పండుగ కాబట్టి.. తన పిల్లలకు హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో అతను ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈలోపే తన 'గుంటూరు కారం' షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకోనుంది మహేష్ కుటుంబం.

కాకపోతే ఈసారి ఆర్.ఆర్.ఆర్ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్..లతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు. మహేష్ ఫ్యామిలీతో పాటు చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ కానున్నాయి. రాంచరణ్- మహేష్..తి క్రిస్మస్ కి కలుసుకుంటుంటారు.
ఈసారి వీరికి తోడుగా ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నాడు. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నమ్రత- ఉపాసన- లక్ష్మీ ప్రణతి..లు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని అభిమానులు మురిపెంగా చెప్పుకుంటారు. గుంటూరు కారం సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారు. ఇది రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications