రాజమౌళి సినిమాకు మహేష్‌బాబు మైండ్‌బ్లోయింగ్ రెమ్యునరేషన్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధినంచి ఇప్పటికే జర్మనీ వెళ్లి కొంత శిక్షణ తీసుకొని వచ్చాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నాడు. భారతదేశంలోని భాషల్లోనే కాకుండా అంతర్జాతీయంగా పలు భాషల్లో దీన్ని విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. దీనికి తగ్గట్లుగానే నటీనటులను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు.
అడిగితే కాదనకుండా చేస్తారు
రాజమౌళితో సినిమా అనగానే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని హీరో నుంచి అభిమానుల వరకు అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు. అందుకు తగ్గట్లుగానే వారు అంతకాలం సినిమా చేసినందుకు, ఓర్పు వహించినందుకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను హీరో ఖాతాలో రాజమౌళి వేస్తాడు. దీంతో అతను ఎన్ని సంవత్సరాలు సినిమా చేయమని అడిగినా కాదనకుండా ఓకే చెప్పేస్తుంటారు. తర్వాత ఆ హీరో మార్కెట్ కూడా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణే ఇందుకు ఉదాహరణ.

తెలుగులోనే పాన్ ఇండియా మార్కెట్
ప్రస్తుతం తెలుగులోనే సినిమాలు చేస్తున్న మహేష్ బాబు పాన్ ఇండియా హీరో స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్యలో పారితోషికం పుచ్చుకుంటున్నారు. అలాంటిది రెండు భాగాలుగానా? మూడు భాగాలుగానా? అనే విషయంలో స్పష్టత లేని రాజమౌళి సినిమాకు అంతకు డబుల్ తీసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత తీసుకుంటున్నారనే విషయం బయటకు రానప్పటికీ ఈ సినిమాకు మహేష్ బాబుకు రూ.200 కోట్ల పారితోషికం ముడుతోందని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ప్రిన్స్ అభిమానులు తమ హీరోను ఎవరూ అందుకోలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications