'గుంటూరు కారం' సినిమా సెన్సార్ రివ్యూ

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ అప్పటి నుంచి పూర్తయ్యేంతవరకు పడుతూ లేస్తూ దీని ప్రయాణం జరిగింది. మహేష్ బాబు నటిస్తున్న పర్ ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతోపాటు 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

mahesh babu movie guntur kaaram censor report

మొదట కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. ఆమెకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరిని మరో కథానాయికగా తీసుకున్నారు. ఇది ప్రారంభమైన సమయానికి పవన్ కల్యాణ్ కు సంబంధించిన సినిమా బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదపడటంతో షూటింగ్ జరిగిందంటే జరిగింది.. జరగలేదంటే.. జరగలేదు అన్నట్లుగా సాగింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ పూర్తయినట్లు నిర్మాతలు ప్రకటించారు. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయినట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తోపాటు మాస్ ను మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

గుంటూరు కారంలో పలు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, చివరి 30 నిమిషాలు అదిరిపోతుందని టాక్ వచ్చింది. ముఖ్యంగా సెంకడాఫ్‌‌లో వచ్చే సీన్లు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటాయాని తెలుస్తుంది. సెన్సార్ టాక్ ని బట్టి చూస్తే.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'గుంటూరు కారం' వసూళ్ల వర్షం కురిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+