మహేష్ బాబు వద్దన్న సినిమా ఏడాదిన్నర ఆడింది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో పలకరించారు. అనుకున్న స్థాయిలో ఆ సినిమా విజయవంతం కాకపోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్టు లేదంటే సెప్టెంబరు నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడైనా ముందుగా కథను తయారుచేసుకునేటప్పుడు మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని రాసుకుంటారు. దాదాపుగా ప్రతి దర్శకుడు ఇలానే చేస్తుంటారు. అయితే అన్ని సినిమాలు చేయలేరు కాబట్టి కొన్ని కొన్ని కారణాలవల్ల మహేష్ బాబు తిరస్కరిస్తూ వచ్చారు. అలా తిరస్కరించిన సినిమాల్లో నువ్వే కావాలి ఒకటి. మయూరి ఫిలింస్ రామోజీరావు, స్రవంతి మూవీస్ రవికిషోర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 2007లో విడుదలైన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాకు మహేష్ బాబు అయితేనే సరిగ్గా సరిపోతాడని రవికిషోర్ భావించారు. అప్పటికి ప్రిన్స్ రాజకుమారుడు సినిమా చేశాడు. కథ విన్న తర్వాత తన ఇమేజ్ కు సరిపోతుందో లేదో అన్న అనుమానంతో మహేష్ బాబు వద్దన్నాడు. మహేష్ బాబు తర్వాత సుమంత్, బాలీవుడ్ హీరో అప్తాబ్ దాసానీ తదితరులకు కూడా ఆడిషన్ టెస్ట్ జరిపారు.
దర్శకుడు విజయ్ భాస్కర్ కు వీరెవరూ నచ్చలేదు. ఒక యాడ్ లో కలిసి నటించిన తరుణ్, రిచా అయితే బాగుంటారని వారిని ఎంపిక చేశారు. కోటిరూపాయల బడ్జెట్ తో నిర్మితమై దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. 20 కి పైగా థియేటర్లలో 250 రోజులకు పైబడి ఆడింది. మరికొన్ని థియేటర్లలో అయితే షిఫ్ట్ చేసి ఏడాదిన్నరపైగా ఆడింది. మహేష్ బాబు నటించివుంటే ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకునేవాడు.












Click it and Unblock the Notifications