మహేశ్ బాబు మూవీ రీ-రిలీజ్‌కు వరల్డ్ వైడ్ బుకింగ్స్.. ఊహకందని బీభత్సం ఇది..!
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ- రిలీజ్ ల హవా నడుస్తోంది. అప్పట్లో హిట్, ప్లాఫ్ తో సంబంధం లేని సినిమాలను ప్రేక్షకుల కోసం మళ్లీ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రీ- రిలీజ్ సినిమాల్లో ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలే ఉంటున్నాయి. అప్పట్లో యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్నాయి. అంతేకాక ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ఈ గ్యాప్ లో పాత సినిమాలతో డబ్బులు దండుకుంటున్నారు థియేటర్ యజమానులు.
ఇప్పటికే వారానికి ఓ సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇటీవల రీ- రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వర్షం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాక ఎన్టీఆర్ యమదొంగ సినిమా రీ- రిలీజ్ అయింది. వసూళ్లు భారీగా వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఖలేజా సినిమా రీ- రిలీజ్ కు సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
ఖలేజా సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలోని మహేష్ ప్రతి డైలాగ్ ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ఈ మూవీని 4K వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న రీ- రిలీజ్ చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షోలో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుకింగ్స్ నమోదవుతూ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ క్రమంలో సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. ఇక ఇప్పటికే రీ- రిలిజ్ అయిన మహేష్ బాబు 'పోకిరి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి.












Click it and Unblock the Notifications