మహేశ్‌బాబు, రాజమౌళి ఫైట్.. ఫ్యాన్స్ లో గందరగోళం
మహేశ్‌బాబు అభిమానులకు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది! టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని విధంగా.. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, అగ్ర దర్శకుడు రాజమౌళి కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్ గందరగోళంలో మునిగిపోయారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? 'వారణాసి' సినిమా ఆగిపోయిందా? లేక వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయా? అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఈ వీడియోను షేర్ చేస్తూ.. "సినిమా ఈజ్ డెడ్" అని క్యాప్షన్ ఇవ్వడం మంటకు నెయ్యి పోసినట్లయింది. ఈ వీడియోలో మహేశ్, జక్కన్న ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని రౌడీల్లా గొడవపడుతుండటం చూసి.. ఇది నిజమైన వీడియోనా లేక షూటింగ్ స్పాట్ లీకా? అని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. కొందరైతే 'వారణాసి' ప్రాజెక్ట్ గమ్యం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

అసలు గుట్టు విప్పిన 'ఏఐ' (AI)!
అయితే, కాసేపటికే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన మాయాజాలమని తేలింది. ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తుపట్టలేనంతగా ఏఐ ఈ వీడియోను డిజైన్ చేసింది. కేవలం వర్మ సరదాగా పోస్ట్ చేసినప్పటికీ.. 'వారణాసి' మీద ఉన్న భారీ అంచనాల వల్ల ఇది ఫ్యాన్స్‌లో తీవ్రమైన కన్ఫ్యూజన్‌కు దారితీసింది.
'వారణాసి' గురించి భయపడాల్సిన పనిలేదు!
ఈ వివాదాస్పద వీడియో పక్కన పెడితే, రాజమౌళి-మహేశ్‌ల 'వారణాసి' షూటింగ్ అత్యంత పకడ్బందీగా సాగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ ఏఐ వీడియో కేవలం టెక్నాలజీ సృష్టించిన భ్రమ మాత్రమేనని, వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారని మూవీ యూనిట్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.












Click it and Unblock the Notifications