Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5.9 కోట్లు! కారణం చెబుతూ ఈడీకి మహేశ్ బాబు లేఖ

ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

మహేశ్ బాబు ఆ రెండు సంస్థలకు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్ బుక్స్ తీసుకురావాలని సూచించింది.

Mahesh Babu writes to ED seeking another date for investigation

పెట్టుబడిదారులను సాయిసూర్య డెవలపర్స్ మోసం చేసిన అభియోగాలున్నాయి. దాదాపు రూ. 100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. రూ. 74.5 లక్షల నగదు సీజ్ చేసింది. మహేశ్ బాబుకు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో 2.5 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించింది.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముక నివాస్ పేరుతో సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ వెంచర్లను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ. 3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. అడ్వాన్స్‌గా రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను పలువురి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది.

సాయితులసి ఎన్ క్లేవ్, షణ్ముక నివాస్ ప్లాట్లు రిజిస్టేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్బ్యూకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబుకు రూ. 5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతోంది. ఇందులో భాగంగానే మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఇక, మరో తేదీ కేటాయించాలన్న మహేశ్ బాబు లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+