నక్క తోక తొక్కిన మాళవిక.... బంపర్ ఆఫర్ కొట్టేసింది!

భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది యానిమల్ మూవీ. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను తీయబోతున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఇటీవలే ప్రకటించారు. యానిమల్ లో రష్మిక హీరోయిన్ గా నటించింది. సీక్వెల్ లో మళయాళ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతోందనే వార్త వైరల్ గా మారింది. తలైవా రజనీకాంత్ కథానాయకుడిగా నటించి పేట సినిమా ద్వారా తమిళ సీమకు ఈ ముద్దుగుమ్మ పరిచయమైంది. తర్వాత శశికుమార్ భార్యగా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

మాస్టర్ సినిమాలో విజయ్ పక్కన నటించి మెప్పించింది. నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం విక్రమ్ కు జోడీగా తంగలాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవెల్ దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఇది విడుదల కాబోతోంది. తాజాగా బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

malavika mohan will act the animal movie sequel

ర‌ణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీలో రష్మిక కథానాయికగా నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టి అదే క్రేజ్‌తో ఇంకా మూందుకు దూసుకుపోతోంది. ముంబయి లాంటి ప్రాంతాల్లో స్పెషల్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించడానికి యూనిట్ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో మాళవిక మోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. యానిమల్‌తో సక్సెస్ అందుకున్న రష్మిక సీక్వెల్లో కనిపిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+