రోజాకు పనిచూసుకోమని చెప్పిన శ్యాంప్రసాద్ రెడ్డి?
ఏ రంగంలో రాణించాలన్నా మాటతీరు ఎంతో మృదువుగా ఉండాలి. ఎదుటివారు ఆకర్షితులవ్వాలి. సంస్కారవంతంగా మంచి మాటలు మాట్లాడుతుంటే మనకు తెలియకుండా ఎంతోమంది మనల్ని అభిమానిస్తారు.. స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ నోటి వాచాలత్వంతో ఎదుటివారు ఏస్థాయిలో ఉన్నారు.. మనం ఏ స్థాయిలో ఉన్నాం.. అనే విషయాలను మరిచి ఏదిపడితే అది మాట్లాడటం, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంలాంటివి చేస్తే ఎవరూ హర్షించరు.. మాట్లాడినవారు కూడా తాత్కాలిక విజయాలను పొందుతారేకానీ అది శాశ్వతం కాదు.
తత్వం బోధపడిన రోజా
ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు ప్రస్తుతం తత్వం బోధపడింది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతోపాటు అక్కడి నియోజకవర్గ ప్రజలు తిరగబడుతుండటంతో ప్రస్తుతం నగరి నుంచి చెన్నైకి మకాం మార్చారు. కొత్తగా ఉపాధిని పొందుదామని ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ రంగంలో గతంలో తాను చేసిన జబర్దస్త్ కార్యక్రమానికే మళ్లీ జడ్జిగా వెళ్దామని మల్లెమాల సంస్థ అధినేత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబుపై, నారా లోకేష్ పై రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు.

వద్దని చెప్పిన మల్లెమాల
రాజకీయాల్లో వివాదాస్పదురాలిగా మారడంతోపాటు పై సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న మల్లెమాల సంస్థ రోజాను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు భాషల్లో ఉన్న టీవీ రంగంలో తనకు అవకాశాలు రావని గ్రహించి ఆమె తమిళం, కన్నడంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త సెల్వమణి దర్శకుడు కావడంతో ఆయన కూడా అవకాశాల కోసం మాట్లాడుతున్నారని, తమిళంలో ఓ రెండు ఛానెళ్లలో కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఓ రెండు నుంచి మూడు సంవత్సరాలపాటు ఆమె రాజకీయాలకు, తెలుగు సినీరంగానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications