దేవుడా ఆ హీరో నా గదిలోకి రాకుండా చూసుకో...స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు.
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..మల్లిక శెరావత్. ఒకప్పుడు బాలీవుడ్‌లో మల్లిక శెరావత్‌కు సూపర్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించకుంది. ఈ తరానికి మల్లిక శెరావత్ పెద్దగ తెలియకపోవచ్చు కానీ..2000ల్లో యూత్‌కు మల్లిక శెరావత్ ఓ శృంగార దేవతే అని చెప్పాలి. కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో మల్లిక శెరావత్ రేసులో వెనుకపడ్డారు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా మల్లిక శెరావత్, ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా 'విక్కీ విద్యా క వో వాలా వీడియో' అనే సినిమాలో నటించరామె.

త్రిప్తి డిమ్రీ, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మల్లిక శెరావత్ సినిమా విషయాలతో పాటు, తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇండస్ట్రీలో ఎన్నో వేధింపుల సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అయితే దుబాయ్‌లో ఉండగా ఒకరోజు ఆ సినిమాలోని హీరో అర్ధరాత్రి వచ్చి నా గది తలుపు తట్టాడు. నేను తలుపులు తీయకపోవడంతో అతను గట్టి గట్టిగా తలుపులు కొట్టాడం మొదలుపెట్టాడు. దాంతో నాకు చాలా భయం వేసి.. దేవుడా అతను నా గదికి రాకుండా చూడు స్వామి అని ప్రార్థించుకున్నాను. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి పని చేయలేదని మల్లిక చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు మాత్రం ఆమె వెల్లడించడానికి ఇష్టపడలేదు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications